వయసు 40 ఏళ్లకు దగ్గర పడుతున్నా.. టాలీవుడ్ బ్యూటీ అనుష్క మాత్రం ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అసలు పెళ్లి మాటెత్తితేనే అమ్మడు తప్పించుకుంటూ ఉంటుంది. గతంలో చాలా మంది హీరోలతో అనుష్కకి ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి.

హీరో ఆర్య, గోపీచంద్ రీసెంట్ గా ప్రభాస్ ఇలాంటి అనుష్కతో చాలా పేర్లు ముడిపెట్టి వార్తలు రాశారు. ప్రభాస్ ని అనుష్క పెళ్లి చేసుకోవడం ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. అయితే వీరిద్దరూ తమ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని మరే ఇతర సంబంధం లేదని స్పష్టం చేశారు.

అనుష్క ఫోటో పెట్టి.. యువకుడిని మోసం చేసి..!

ఇది ఇలా ఉండగా.. తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతకీ ఏంటంటే.. అనుష్కకి టీమిండియా క్రికెటర్ తో పెళ్లి జరగబోతుందని అంటున్నారు. ఉత్తరాదికి చెందిన ఓ ఆటగాడితో అనుష్క ఏడడుగులు వేయబోతుందనే ప్రచారం ఊపందుకుంది.

అయితే ఆ ప్లేయర్ ఎవరనే విషయంపై క్లారిటీ లేదు. దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేకపోవడం.. కొంతమంది ఇది రూమర్ అయి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'బాహుబలి' కోసం చాలా రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్న అనుష్క కొంత గ్యాప్ తరువాత 'నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.