మలయాళ సూపర్‌ హిట్ ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ అనుపమా పరమేశ్వరన్‌. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ తరువాత తెలుగులోనూ తన మార్క్ చూపించింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అనుపమా. తెలుగులో వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలోనూ తన మార్క్ చూపించింది.

సినిమాలో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాల విశేషాలతో పాటు ఫ్రీ టైంలో తాను ఇంట్లో కుటుంబం సభ్యులతో కలిసి చేసే సరదా సరదా పనులను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది అనుపమా. ఇక ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్ లను కూడా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసేకుంటుంది అనుపమా.

అయితే క్వారెంటైన్‌ టైంలో అభిమానులతో మరింతగా ఇంటరాక్ట్ అవుతున్న అనుపమాకు హ్యాకర్స్‌ షాక్‌ ఇచ్చారు. తాజాగా ఈ భామ ఫేజ్‌ బుక్‌ పేజ్‌ హ్యాక్‌ అయ్యింది. ఈ విషయాన్ని గ్రహించిన అనుపమా తన పేజ్‌ హ్యాక్‌ అయ్యిందని తాను మళ్లీ చెప్పేవరకు ఆ పేజ్‌లో వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దని కోరింది. అయితే ఈ మెసేజ్‌ చేసిన కొద్ది సేపటికే అనుపమా ఫేస్‌ బుక్‌ పేజ్‌ డిలీట్‌ అయ్యింది. దీంతో అభిమానులు షాక్‌ అయ్యారు. తిరిగి అనుపమా పేజ్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.