బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మలైకా సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేశారు. దీనితో ఆమె అభిమానులు ఒకింత కంగారు పడ్డారు. కరోనా సోకిన వెంటనే మలైకా హోమ్ కొరెంటైన్ అయ్యారు. ఇంటిలోనే కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కరోనా వస్తే సోషల్ డిస్టెన్స్ తప్పదు. నెగెటివ్ రిజల్ట్ వచ్చాక కూడా కొన్ని రోజులు అందరికీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో తన ప్రియమైన వారి దగ్గరకు వెళ్లలేకపోతున్నా, వారిని హత్తుకులేకపోతున్నా అని మలైకా చాలా ఇబ్బంది పడుతున్నారు.
 
ఈ విషయాన్ని ఓ భావోద్వేగ సందేశం ద్వారా మలైకా తెలియజేశారు. 'ప్రేమకు హద్దులు ఉండవు. సామాజిక దూరం పాటిస్తూ, కొరెంటైన్ లో ఉంటూ కూడా మేము ఒకరినొకరం గమనించుకోవడం, మాట్లాడుకోగలుగుతున్నాం. అయినప్పటికీ నా ఇద్దరు బేబీస్ ని ఇంకొన్ని రోజులు కౌగించుకునే అవకాశం లేకపోవడం నా గుండె పగిలేలా చేస్తుంది. వారి అందమైన ముఖాలు చూస్తుంటే నాకు దైర్యం, శక్తి వస్తున్నాయి' అని పోస్ట్ పెట్టారు. 

మలైకా కుమారుడు అర్హాన్ ఖాన్, పెంపుడు కుక్క కాస్పర్ ని ఉద్దేసింది మలైకా ఈ పోస్ట్ పెట్టారు. పోస్ట్ లో దూరంగా బాల్కనీలో నిల్చొని చూస్తున్న అర్హాన్ ఖాన్ మరియు కాస్పర్ ఫోటోను కూడా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ఇక మలైకా అరోరా ప్రియుడు అర్జున్ కపూర్ కి కూడా కరోనా సోకింది. అర్జున్ కపూర్ కరోనా బారినపడిన వెంటనే మలైకా అరోరా తనకు కరోనా వచ్చిందని ప్రకటించారు. దీనితో లాక్ డౌన్ లో కూడా ఈ జంట షికార్లు ఆపలేదని అందరూ అంటుకుంటున్నారు.