కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తూ సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్‌.. ఫస్ట టైమ్ ఓటీటీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 


టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. యూత్‌ఫుల్‌, లవ్‌, కమర్షియల్‌ చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా ప్రేక్షకులకు చేరువైయ్యాడు విశ్వక్‌. ఇటీవల ‘దాస్‌ కా దమ్కీ’తో ప్రేక్షకులను అలరించిన విశ్వక్‌.. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ సినిమా చేస్తున్నారు. కృష్ణచైతన్య దీనికి దర్శకత్వం వహించనున్నారు. అయితే అదే సమయంలో తన అభిమానులకు ఓ సర్పైజ్ ఇవ్వబోతున్నాడని, త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడని తెలుస్తోంది. 

ఇప్పటికే హీరోగా, కథకుడిగా, డైరెక్టర్‌గా అతడు ఇప్పటికే నిరూపించుకున్నాడు. దాస్ కా దమ్కీ చిత్రానికి కూడా తానే దర్శకత్వం వహించి.. హీరోగా నటించాడు. కాగా, విశ్వక్‍సేన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍‍లో ఓ షోకు హోస్ట్‌గా వ్యవహించనున్నాడని సమాచారం. ఆహా ఓటీటీలో విశ్వక్ ఓ షో చేయనున్నారు. ఈ షో లో మొత్తంగా ఈ షో 15 ఎపిసోడ్లు ఉంటాయని సమాచారం. 

Scroll to load tweet…
Scroll to load tweet…

అయితే, ఇది టాక్ షోనా లేక రియాల్టీ షోనా.. గేమ్ షోనా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఇది ఓ టాక్ షో అనే వినిపిస్తుంది. ఈ విషయంపై ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ త్వరలోనే ప్రకటించనున్నారు. బాలకృష్ణ ‘అన్‍స్టాపబుల్‍’ని గుర్తు చేసేలా విశ్వక్ షో ఉంటుందంటూ అంచనా వేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే ఆహా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే సినిమాలు చేసుకోక.. అప్పుడే ఓటిటిలోకి రావటం ఎందుకు అని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు.

 ‘దాస్ కా ధమ్కీ’ హిట్ తర్వాత VS11 చిత్రంలో నటిస్తున్నారు. సితార్ ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘రౌడీ ఫెలో’ డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. కాగా ఈ మూవీ ఒక పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది.