చెన్నై: హీరో విశాల్ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కోలివుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై హీరో విశాల్ స్పష్టత ఇచ్చారు. ట్విట్టర్ వేదిక ద్వారా ఆ ప్రచారాలకు స్పష్టత ఇచ్చారు 

ఆ వార్తలు నిజమేనని, తన తండ్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ఆయనకు సాయం చేసే క్రమంలో తనకు కూడా జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. 

అదే విధంగా తన మేనేజర్ కు కూడా ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయని, తామంతా ఆయుర్వేద మందు తీసుకుంటున్నామని, ఓ వారంలో ప్రమాదం నుం బయటపడుతామని, ప్రస్తుతానికి తమ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నానని విశాల్ వివరించారు. 

 

ఇటీవలి కాలంలో పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు కరోనా వైరస్ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసింేద. కోలీవుడ్ లో అర్జున్ కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు.