తమిళనాటు సినీ రాజకీయాలు కొంత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒక హీరో గురించి మరో హీరో చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వాటిని జనాలుచాలా ఇంట్రెస్ట్ గా గమనిస్తున్నారు.
కోలీవుడ్ లోమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ముందు ఉన్నాడు హీరో విశాల్. తాజాగా ఆయన 47వ సవంత్సరంలోకి అడుగు పెట్టాడు. వరుస సినిమాలు చేస్తున్న విశాల్.. ఇంత వరకూ పెళ్ళి చేసుకోలేదు. రెండు మూడు సార్లు మాత్రం పెళ్లి వరకూ వచ్చిఆగిపోుయింది. ఇక తాజాగా ఆయన తన బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారనే ప్రచారం ఇటీవలి కాలంలో మరింత ఊపందుకుంది. మరోవైపు, విజయ్ పొలిటికల్ ఎంట్రీపై మరో హీరో విశాల్ స్పందించాడు. విజయ్ రాజకీయాల్లోకి వస్తే మనసారా అభినందిస్తానని చెప్పాడు. విశాల్ నిన్న 46వ జన్మదినాన్ని జరుపుకున్నాడు. చెన్నైలోని కోయంబేడులో అభిమానుల మధ్య కేక్ ను కట్ చేశాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన తల్లి కోయంబేడు మార్కెట్ లోనే పూలు, కాయగూరలు కొంటారని చెప్పాడు. తనను 19 ఏళ్లుగా హీరోగా ఆదరిస్తున్న తమిళ ప్రేక్షకులకు ధన్యవాదాలను తెలియజేశాడు. అనంతరం కీల్పాక్ లోని అనాధాశ్రమానికి వెళ్లి అక్కడున్న చిన్నారుల మధ్య కేక్ ను కట్ చేశాడు. చిన్నారులతో కలిసి కొంత సమయాన్ని గడిపాడు. ఆ తర్వాత తన తాజా చిత్రం యూనిట్ సభ్యుల మధ్య కూడా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు.
