విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి 'వెంకీమామ' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. ఈ క్రమంలో హీరో వెంకటేష్.. చైతు హీరో అవుతాడని అసలు ఊహించలేదని అన్నారు. 

నిజానికి రానా కూడా హీరో అవుతాడని ఊహించలేదని.. ప్రస్తుతం అందరం సినిమాల్లోనే ఉన్నామని చెప్పుకొచ్చాడు. చైతూకి, రానాకి, తనకు కూడా సినిమా ఆలోచన లేదని.. అందుకే అమెరికా కూడా వెళ్లిపోయానని.. కానీ అనుకోకుండా ఇప్పుడు అంతా సినిమాల్లోనే ఉన్నామని చెప్పారు. 

చిన్నప్పుడు నాగచైతన్య చాలా లావుగా ఉండేవాడని, ఎప్పుడూ చికెన్ తింటూ, పెద్ద పెద్ద బుగ్గలతో ముద్దుగా ఉండేవాడని చెప్పుకొచ్చాడు వెంకీ. అలాంటివాడు ఇప్పుడు ఫిట్ గా, స్లిమ్ గా తయారయ్యాడని మెచ్చుకున్నాడు. తన కళ్లముందు పెరిగిన నాగచైతన్యతో కలిసి నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పుకొచ్చాడు. 

చైతుతో మొదటిరోజు షూటింగ్ టైంలో ఇబ్బంది పడ్డానని వెంకీ చెప్పారు. రియల్ లైఫ్ లో క్యాజువల్ గా మాట్లాడుకునేవాళ్లం, నటించాలంటే కష్టమేనని అన్నారు. ఒక్కోసారి సీన్ కి సీన్ కి మధ్య చాలా సైలెంట్ గా ఉండిపోయేవాళ్లమని.. మెల్లగా క్యారెక్టర్స్ లోకి వెళ్లిన తరువాత సర్దుకున్నామంటూ చెప్పుకొచ్చారు.

ఇలాంటి ఇబ్బందులు ఉంటాయనే, సినిమా షూటింగ్ కి డైలాగ్ సీన్స్ తో కాకుండా.. మాంటేజ్ సాంగ్ తో మొదలుపెట్టామని చెప్పారు. సినిమా మొత్తానికి షాకింగ్ ఎలిమెంట్ ఉంటుందని.. క్లైమాక్స్ లో బిగ్ సర్ప్రైజ్ ఉంటుందని.. అది చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని చెప్పుకొచ్చారు.