దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు, భావోద్వేగానికి కారణమైన దిశ కేసులో నిందితులని హైదరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. పోలిసుల కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. దిశకు సరైన న్యాయం జరిగిందని అంతా భావించారు. 

కానీ ఎన్ కౌంటర్ పై మేధావులు, మహిళా సంఘాల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర దిశ కేసులో ఎన్ కౌంటర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశంలో అత్యాచారం, హత్య చేసిన వ్యక్తులు నలుగురేనా అని ప్రశ్నించాడు. 

కోర్టులో విచారణ పూర్తి కాకముందే ఎన్ కౌంటర్ చేయడం సరికాదు. ఇలాంటి ఎన్ కౌంటర్ లు ప్రముఖులు ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే చేయగలరా అని ఉపేంద్ర ప్రశ్నించాడు. 

ఎన్ కౌంటర్లు ద్వారా రౌడీయిజాన్ని, ఇలాంటి నేరాలని అరికట్టవచ్చు. కానీ ధనవంతుల విషయంలో కూడా ఇదే వైఖరిని కొనసాగించగలగాలి. ధనవంతులు చట్టాలని సులువుగా దుర్వినియోగం చేస్తున్నారు అని ఉపేంద్ర తెలిపారు. 

అలాంటి భర్త ఆమెకు అవసరమా.. చెన్నకేశవులు భార్యపై జీవిత కామెంట్స్!

ఉపేంద్ర కామెంట్స్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఉపేంద్ర కామెంట్స్ ని సమర్థిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు.