సినిమా వాళ్లకు మామూలు జనం కన్నా కాస్తంత ఎక్కవ నమ్మకాలు..మూఢ నమ్మకాలు ఉంటూంటాయి. ఒక హిట్ వచ్చిందంటే ఆ సినిమాకు సంభందించిన బోయ్ దగ్గర నుంచి అందరినీ తమ తదుపరి సినిమాకు కంటిన్యూ చేస్తూంటారు. ఆ తదుపరి సినిమా కూడా హిట్ కొడితే ఆ నమ్మకం ..మూఢ నమ్మకంగా మారిపోతుంది. ఇలాంటివి సినీ పరిశ్రమలో బోలెడు కనిపిస్తాయి. అయితే యంగ్ హీరోలకు కాస్తంత ఇలాంటి ఛాదస్తాలు తక్కువనే చెప్పాలి. అయితే అటు యంగ్ హీరోకు, ఇటు సీనియర్ హీరోలకు మధ్యలో ఉన్న రామ్ కు కూడా ఇలాంటి నమ్మకాలు ఉన్నాయని ఈ మధ్యన వినిపిస్తోంది. అందుకు కారణం గోవా.

ఇంతకీ రామ్ కు ఉన్న నమ్మకానికి, గోవా కు ఉన్న లింకేంటి అంటారా...ఈ హీరో ..గోవాలో షూట్ చేసిన సినిమాలన్ని సూపర్ హిట్స్ అవుతున్నాయట. నేను శైలజ సినిమా లో మేజర్ సీన్స్ గోవాలో షూట్ చేసారు. ఆ సినిమా హిట్ అవటంతో ..ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లో మేజర్ సీన్స్ ని కూడా గోవాలో షూటింగ్ పెట్టుకున్నారు. ఆ సినిమా కూడా పెద్ద హిట్టే. మద్యలో వచ్చిన ప్లాఫ్ సినిమాలకు దూరంగా గోవా ఉండిపోయింది.

దాంతో హిట్ కావాలంటే గోవా వెళ్లాల్సిందే అని రామ్ ఫిక్సై పోయాడట. ఇందులో నిజమెంతో కానీ తాజా చిత్రం రెడ్ కూడా 11 రోజులు పాటు గోవాలోనే షూటింగ్ పెట్టుకున్నారు రామ్. ఈ సినిమా కూడా హిట్టైందా..ఇక గోవాలోనే సినిమా ఓపినింగ్ పెట్టుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదంటున్నారు.

2019లో 100కోట్ల సినిమాలు.. నెగిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైంది!

రామ్‌ పోతినేని  హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్‌ (RED)’. ఈ చిత్రానికి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.   స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలను అందిస్తున్నారు.  రామ్‌-కిషోర్‌ తిరుమల కలిసి చేస్తున్న మూడో చిత్రమిది.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. హ్యాట్రిక్‌ చిత్రంగా ‘రెడ్‌’ రాబోతోంది. తమిళంలో విజయం సాధించిన ‘తడమ్‌’కు రీమేక్‌గా ఇది రాబోతోంది.  వచ్చే ఏడాది ఏప్రిల్‌ 9న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబరు 16 నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఇటీవల విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు రామ్‌. పూరీ జగన్నాథ్‌ ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్స్. పూరీ జగన్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు.