యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజయింది. అన్ని చోట్ల నుంచి భీష్మ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫిలిం క్రిటిక్స్ కూడా మంచి రివ్యూలు ఇస్తున్నారు. ఈ శివరాత్రికి విడుదలైన భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు మొదలు పెట్టారు. 

హ్యాట్రిక్ ఫ్లాపులకు అడ్డు కట్ట వేస్తూ నితిన్ భీష్మతో విజయాన్ని అందుకోవడం ఊరటనిచ్చే అంశం. అదే ఉత్సాహంతో  ఈ ఏడాది నితిన్ రెండు మూడు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అందులో ఒకటి హిందీలో ఘనవిజయం సాధించిన అంధాదున్. 

ఆయుష్మాన్ ఖురానా, టబు కీలక పాత్రల్లో నటించిన అంధాదున్ మూవీ క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర రీమేక్ హక్కులని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ చిత్ర రీమేక్ లో ఇతర హీరోలు నటించబోతున్నట్లు కొంతమంది పేర్లు వినిపించాయి. దీనిపై భీష్మ ప్రమోషన్స్ లో నితిన్ క్లారిటీ ఇస్తూ..  అంధాదున్ రీమేక్ లో తానే నటించబోతున్నానని, మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తాడని నితిన్ ప్రకటించాడు. 

సర్ ప్రైజ్.. రెండవసారి తల్లైన సాగర కన్య!

ఈ చిత్రంలో నటించనుండడం నితిన్ కు ఒకింత భయాన్ని కూడా కలిగిస్తోందట. రీమేక్ చిత్రాలు వచ్చిన ప్రతి సారి ఒరిజినల్ వర్షన్ తో పోల్చుతారు. పైగా అంధాదున్ చిత్రానికి గాను ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అంశమే నితిన్ భయానికి కారణం. ఏది ఏమైనా అంధాదున్ రీమేక్ తన కెరీర్ లో ఓ వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుందని నితిన్ అంటున్నాడు. 

అలా చేస్తే అతడి తల నరుకుతా.. స్టార్ హీరోకి బెదిరింపులు

అంధాదున్ రీమేక్ తో పాటు.. వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే చిత్రం, చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో చెక్ చిత్రాల్లో నితిన్ ఈ ఏడాది నటించబోతున్నాడు.