కెరీర్ పరంగా హీరో నిఖిల్ సిద్దార్ద గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏవీ అతను అనుకున్నట్లు జరగటం లేదు. ఆయన చివరి చిత్రం కిరాక్ పార్టీ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత మొదలెట్టిన అర్జున్ సురవరం సినిమా గత సంవత్సర కాలంగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవటానికి నానా యాతనలు పడుతోంది. ఈ నేపధ్యంలో నిఖిల్ ..కార్తికేయ 2 మొదలెట్టాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది.

ఇదంతా ప్రక్కన పెట్టి పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే ... నిఖిల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. సిని ప్రపంచానికి సంభందం లేని ఓ డాక్టర్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇది రెండు కుటుంబాల వాళ్లకు తెలుసు అని, ఇద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని   లక్ష్మీ మంచు హోస్ట్ చేస్తున్న ఓ షోలో స్వయంగా నిఖిల్ వెల్లడించారు.  ఓ డిజిటల్‌ ప్లాట్‌ ఫాం కోసం మంచు లక్ష్మీ చేస్తున్న టాక్‌ షో ఫీట్ అప్‌ విత్‌ స్టార్స్‌. తారల బెడ్‌ టైం స్టోరీస్‌ పేరుతో ప్రమోట్ చేసిన ఈ షో వూట్స్‌ లో ప్రసారమవుతోంది. ఈ షో  లో పాల్గొన్న నిఖిల్ తన పర్శనల్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

నిఖిల్ మాట్లాడుతూ... నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి ఓ డాక్టర్. ఆమె చాలా కేరంగ్, అర్దం చేసుకునే మనస్తత్వం. ఆమె నేను షూటింగ్ లో ఉన్నప్పుడు కానీ, నా స్నేహితులతో బయిటకు వెళ్లినప్పుడు కానీ డిస్ట్రబ్ చెయ్యదు. నా ఫోన్ చెక్ చేయదు. ప్రతీ ఒక్కరికి తమ పర్శనల్ స్పేస్ ఉండాలని కోరుకుంటుంది. అది నాకు బాగా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కే అవకాసం ఉందని తెలుస్తోంది.