Asianet News TeluguAsianet News Telugu

తొక్కేయాలని చూస్తారు.. టాలీవుడ్ లో నెపొటిజంపై హీరో నిఖిల్

రీసెంట్‌గా ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి అడిగారు. టాలీవుడ్‌లో కూడా నెపోటిజం ఉందా? సుశాంత్ సింగ్ మృతిపై ఎలా స్పందిస్తారు అంటూ నిఖిల్‌ని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.
 

Hero  Nikhil Comments on nepotism in tollywood
Author
Hyderabad, First Published Jun 22, 2020, 7:26 AM IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం అందరినీ షాక్ కి గురిచేసింది. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం కారణంగానే సుశాంత్ తన ప్రాణాలు తీసుకున్నాడంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు బాలీవుడ్ లోని స్టార్ కిడ్స్ ని, దర్శక నిర్మాతలను సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. సుశాంత్ మరణ వార్త బాలీవుడ్ సినీ అభిమానులతోపాటు.. టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా చలించిపోయారు. ఈ నేపథ్యంలో.. ఈ విషయంపై హీరో నిఖిల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... నిఖిల్ సిద్దార్థ్ తను నటించిన ‘అర్జున్ సురవరం’ చిత్రం బుల్లితెరపై టెలికాస్ట్ అవుతున్న సందర్భంగా సోషల్ మీడియాలో నెటిజన్లతో లైవ్ చాట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చాట్‌లో నెటిజన్లు రీసెంట్‌గా ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి అడిగారు. టాలీవుడ్‌లో కూడా నెపోటిజం ఉందా? సుశాంత్ సింగ్ మృతిపై ఎలా స్పందిస్తారు అంటూ నిఖిల్‌ని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.

 అభిమానులు అడిగిన ప్రశ్నలకు నిఖిల్ స్పందించారు. ‘‘నిజంగా చెబుతున్నా.. టాలీవుడ్‌లో మాత్రం అలాంటిదేమీ లేదు. టాలీవుడ్ నాకు చాలా బాగా స్వాగతం పలికింది. ఇక్కడ అందరూ ఎంతగానో ప్రోత్సహించారు. టాలీవుడ్ ఫ్యామిలీలో నేను కూడా భాగమైనందుకు ఎంతగానో గర్వపడుతుంటాను. ఇక సుశాంత్ సింగ్ విషయానికి వస్తే.. నెపోటిజం అనేది ప్రతి చోటా ఉంటుంది. ప్రతి వృత్తిలో ఉంటుంది. తొక్కేయడానికి చూస్తారు అయితే.. మన కష్టంతో, టాలెంట్‌తో నిలబడాలి. ఎవరెన్ని మాటలు అన్నా పట్టించుకోకూడదు. సక్సెస్ కోసమే ప్రయత్నించాలి. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా.. కష్టపడటం, టాలెంట్ వంటివే నిలబెడతాయి. ఏది ఏమైనా చావు మాత్రం పరిష్కారం కాదు. సుశాంత్ విషయంలో జరిగింది చాలా బాధాకరమైన విషయం..’’ అని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios