టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ (Kartikeya) కొత్త సినిమా షూర్ అయ్యింది. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ రోజు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసి, సినిమాను ప్రకటించారు మేకర్స్.
తొలిచిత్రం ఆర్ ఎక్స్ 100 (RX100)తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో కార్తీకేయ. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా తన తొమ్మిదో చిత్రం షూరు అయ్యింది. ఢిపరెంట్ జానర్ లో కార్తీకేయ కనిపించనున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభైంది. ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమంగా ఘనంగా పూర్తయ్యింది. కార్తీకేయ భార్య లోహిత కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. వంశీ క్లాప్ ఇచ్చి సినిమాను ప్రారంభించారు. కార్తీకేయ సరసన హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) నటిస్తోంది. క్లాక్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేయనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా మేకర్స్ అదిరిపోయే పోస్టర్ వదిలారు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పోస్టర్ లోని డిటేయిల్స్ పరిశీలిస్తే ఒక కెమెరా లెన్స్ లో పలు మతాలకు సంబంధించిన గుర్తులు, తాళపత్ర గ్రంథాలు, కొన్ని పరిసరాలు, సముద్రపు అలలను చూడవచ్చు. వీటిని బట్టి సినిమాలో అడ్వెంచర్స్ చాలా ఉండనున్నట్టు తెలుస్తోంది. సరికొత్త సబ్జెక్ట్ తో కార్తీకేయ అభిమానులను అలరిచేందుకు రెడీ అవుతున్నాడు. లౌక్య ఎంటర్ టైన్ బ్యానర్ పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు.
తన కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కార్తీకేయ ట్విటర్ వేదికన స్పందించారు. తన కేరీర్ లోనే ఎప్పుడు చేయని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలిపారు. ఈ స్పెషల్ మూవీ షూటింగ్ ప్రారంభమవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కార్తీకేయ ఇటు తెలుగు ఆడియెన్స్ తోపాటు, అటు తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన Valimai చిత్రంలో విలన్ పాత్రతో మెప్పించాడు కార్తీకేయ.
