హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఎక్స్ 200 చిత్రంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న కార్తికేయ ప్రస్తుతం మరో హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. యువతకు నచ్చే కథాంశాలు ఎంచుకుంటున్నాడు. 

90 ఎంఎల్ ప్రచార కార్యక్రమాల్లో కార్తికేయ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఎన్టీఆర్ తన అభిమాన నటుడు అని పేర్కొన్నాడు. మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వేస్తే మరో హీరోగా ఎవరిని కోరుకుంటావు అని ప్రశ్నించగా.. కార్తికేయ ఎన్టీఆర్ పేరు చెప్పాడు. మల్టీస్టారర్ చిత్రం చేయాల్సి వస్తే నా మొదటి ప్రాధాన్యత ఎన్టీఆర్ కే అని కార్తికేయ తెలిపాడు. 

కార్తికేయ మాట్లాడుతూ.. నేను ఎన్టీఆర్ ని ఎంతవరకు కలవలేదు. కానీ ఇతర నటులు ఎన్టీఆర్ గురించి అద్భుతంగా మాట్లాడడం విన్నా. ఎన్టీఆర్ అద్భుతమైన నటనా నైపుణ్యంగల హీరో అని రావు రమేష్ లాంటి నటులు తనతో చెప్పినట్లు కార్తికేయ పేర్కొన్నాడు. 

జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అద్భుతమైన నటులలో ఒకరు. అందులో ఎలాంటి సందేహం లేదు. కార్తికేయ లాంటి యువ హారో ఎన్టీఆర్ కు ఆకర్షితుడు కావడం ఆశ్చర్యపోవాల్సిన అంశంమేమీ కాదు. పలువురు యువ హీరోలు ఎన్టీఆర్ తమ ఫేవరేట్ నటుడని ఇప్పటికే చెప్పారు.