ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. నెలల తరబడి వేధిస్తున్న కరోనా ఇప్పటికే చేయాల్సిన ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం చేసేసింది. కరోనాకి కరోనా విజృంభిస్తున్నప్పటికీ నెలల తరబడి లాక్ డౌన్ కొనసాగించలేని పరిస్థితులలో ప్రభుత్వాలు ఉన్నాయి. 

అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాగాలు అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నాయి. అందుకు ఉదాహరణే తమిళనాడులోని ఎరోడ్ నగరం. నెల క్రితం ఇది కరోనా రెడ్ జోన్. కానీ ఇప్పుడు గ్రీన్ జోన్ గా మారింది. అందుకు కారణం అక్కడి పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న చర్యలే. 

బికినీలో మైండ్ బ్లోయింగ్ హాట్.. అందాలతో రచ్చ చేస్తున్న ఎన్నారై బ్యూటీ

ఎరోడ్ రెడ్ నుంచి గ్రీన్ జోన్ గా మారడంతో తమిళ హీరో కార్తీ సంతోషం వ్యక్తం చేశాడు. ఎరోడ్.. రెడ్ నుంచి గ్రీన్ జోన్ గా మారిన తొలి జిల్లా.. గత 32 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ఈ గొప్ప ఘనతకు కారణం పోలీసులు, వైద్యులు, ఇతర పారిశుద్ధ్య కార్మికులే.. వారికి నా బిగ్ సెల్యూట్ అని హీరో కార్తీ ట్వీట్ చేశాడు. 

కరోనా వ్యాప్తి తగ్గుముఖం పెట్టె రోజు కోసం యావత్ దేశం, ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.