నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna) గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ‘అఖండ’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య.. ప్రస్తుతం ‘ఎన్బీకే 107’పై ఫోకస్ పెట్టారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
నందమూరి బాలకృష్ణ ఇటీవల `అఖండ` తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఆయన అప్ కమింగ్ ఫిల్మ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ‘ఎన్బీకే 107’పై ఫోకస్ పెట్టారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ‘టైటిల్’పైనా, హీరోయిన్ ఎంపికైన సోషల్ మీడియా తెగ చర్చ నడిచింది. కాగా తాజగా మేకర్స్ ఎన్బీకే 107 నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో బాలయ్య చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ చాలా మాస్ లుక్ ను కలిగి ఉంది. బాలక్రిష్ణ బ్లాక్ షర్ట్, లుంగీ, సన్ గ్లాసెస్ ధరించి నడుచుకుంటూ వస్తున్న స్టిల్ పోస్టర్ లో కనిపిస్తోంది. ఆయన పక్కనే మాస్ లుక్ నిచ్చే డిఫెండర్ వెహికిల్ ఉండటంతో పోస్టర్ ట్రెండీ లుక్ ను సంతరించుకుంది. ప్రస్తుతం పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రానికి గోపీచంద్ (Gopichand Malineni)మాలినేని దర్శకత్వం వహిస్తుండగా.. శ్రుతి హాసన్ (Shruti Haasan) బాలయ్య బాబుకు జోడీగా ఆడిపాడనుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించనున్నారు.
`క్రాక్` (Krack) తర్వాత గోపీచంద్ మాలినేనితో బాలకృష్ణ చేస్తున్న చిత్రమిది. `క్రాక్` చిత్రం చూసిన బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేని అభినందించారు. తనతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సినిమాని అధికారికంగా ప్రకటించి, తాజాగా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. మాస్ లుక్ లో బాలయ్య అదిరిపోయారు. అభిమానులు పోస్టర్ కు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అప్పట్లో ఈ చిత్రానికి `రౌడీయిజం` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారంటూ సోషల్ మీడియాలో పూకార్లు వచ్చాయి. కాగా వాటిని అప్పుడే చిత్ర నిర్మాణ సంస్థ కొట్టిపారేసింది. ఫస్ట్ లుక్ రిలీజ్ అప్పుడన్న టైటిల్ వచ్చే అవకాశం ఉందని భావించిన అభిమానుల అంచనాలు తారుమారాయి. ప్రస్తుతం టైటిల్ కు సంబంధించి ఎలాంటి స్పష్టత, అధికారిక ప్రకటన వెలువడ లేదు.
