బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ గా పేరు తెచ్చుకున్నారు. అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఆ క్రేజ్ ని ఆ తర్వాత వచ్చిన సాహో డిజాస్టర్ అవటం దారుణంగా దెబ్బకొట్టింది. సాహో హిట్టైతే కథ వేరే విధంగా ఉండేది కానీ..అది దారుణంగా విఫలమవటంతో ఇప్పుడు చేస్తున్న సినిమా బిజినెస్ పై ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుందని టీమ్ కు అర్దమైంది. దాంతో అర్జెంటుగా స్క్రిప్టులో మార్పులు చేయమని దర్శకుడుకు పురమాయించిన ప్రభాస్..బడ్జెట్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ నిర్ణయం సరైనదా కాదా అనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

మొదట భారీ బడ్జెట్ తో సినిమా ప్రారంభించిన ప్రభాస్...ఇప్పుడు దాన్ని 150 కోట్లకు కుదించాడని తెలుస్తోంది. అందులో ప్రభాస్ రెమ్యునేషన్ ఎంత అనేది తెలియదు.స్టార్స్, టెక్నీషియన్స్ రెమ్యునేషన్స్ తీసేయగా మిగిలిన డబ్బుతోనే షూట్ చేయాలి. ఈ సినిమాకు భారి సెట్స్ అవసరం అవుతున్నాయి. దాంతో దర్శకుడు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నట్లు చెప్తున్నారు.

వైరల్ ఫొటోలు : చీరకట్టులో జాన్వీ సెక్సీ లుక్, చూసే కళ్లదే లక్

అప్పటికీ లావిష్ గా ఉండే సీన్స్ చాలా భాగం తగ్గించుకున్నాడని, ప్రభాస్ మీదే ఫోకస్ మొత్తం పెట్టాడని అంటున్నారు. దానికి తోడు ఈ చిత్రం దర్శకుడు రాధాకృష్ణ తొలి చిత్రం జిల్ సరిగ్గా ఆడకపోవటం కూడా ప్రతికూలాంశమే. ఏరికోరి ప్లాఫ్ డైరక్టర్ ని తెచ్చుకున్నాడని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే బిల్లా తర్వాత ప్రభాస్ హీరోగా గోపికృష్ణా మూవీస్ నిర్మిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్, ఇంటర్నేషనల్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని గ్రాండియర్ ప్రొడక్షన్స్ వేల్యూస్‌తో నిర్మించనున్నారు. టెక్నీకల్‌గా హై స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం ఉండనుంది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస... ప్రొడక్షన్ డిజైనింగ్‌ కు రవీందర్.. ప్రముఖ ఎడిటర్ హిట్స్‌లో భాగమైన శ్రీకర్ ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించబోయే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది.  ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.