నందమూరి నటసింహం బాలకృష్ణకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన మొట్ట మొదటి హీరో తన బాబాయి బాలయ్య అంటూ తారక్ పేర్కొన్నారు. తనలోని అభిమానిని తట్టిలేపింది కూడా ఆయననే నంటూ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK’’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కి అభిమానుల నుంచి రెస్పాన్స్ అదిరిపోయింది. తారక్ ట్వీట్ కింద అభిమానులు బాలకృష్ణ, ఎన్టీఆర్ లు గతంలో కలిసి దిగిన ఫోటోలను కామెంట్స్ రూపంలో షేర్ చేయడం విశేషం.

 

ఇదిలా ఉండగా.. కళ్యాణ్ రామ్ కూడా.. సోషల్ మీడియా వేదికగా.. బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే  సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai ’’ అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా.. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా మంగళవారమే అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. బోయపాటి  దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా.. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. అందులో బాలయ్య లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది.