టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది ధోనీని ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీల్లో కూడా ధోనీకి అభిమానులు ఉన్నారు. ఈ విషయం మరోసారి రుజువైంది.

ఇంతకీ ఆ అభిమాని ఎవరో తెలుసా.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఈ బాలీవుడ్ హీరో 'దబాంగ్ 3' సినిమాలో నటిస్తున్నాడు. కొద్దిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సల్మాన్ స్టార్ స్పోర్ట్స్ లో వచ్చే 'క్రికెట్ లైవ్' అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు.

2019లో 100కోట్ల సినిమాలు.. నెగిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైంది!

సల్మాన్ తో పాటు సినిమాలో విలన్ గా నటించిన సుదీప్ కూడా ఇందులో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీం ఇండియా ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ తో తనకున్న అనుబంధాన్ని సల్మాన్ వెల్లడించాడు. కేదార్ తనకు వ్యక్తిగతంగా బాగా తెలుసునని, ధోనీ తన అభిమాన క్రికెటర్ అని చెప్పాడు.

అంతేకాదు.. ధోనీ 'దబాంగ్ ప్లేయర్' అని అన్నారు. ఇక సుదీప్ ఎవరు బాగా ఆడితే వాళ్లే తన అభిమాన ఆటగాడు అని తెలిపాడు. తనకు పర్టిక్యులర్ గా అభిమాన క్రికెటర్ ఎవరూ లేరని.. ఆరోజు ఎవరు బాగా ఆడితే వాళ్లని ఇష్టపడతానని అన్నారు. అంతేకాక.. ఒక అభిమానిగా ప్రతి ఒక్క ఆటగాడిని గౌరవించాలని అనుకుంటున్నానని.. తను ఎప్పటికీ ఇష్టపడేది మాత్రం అనిల్ కుంబ్లే సర్ ని అని చెప్పారు. రోహిత్ శర్మ అంటే కూడా ఇష్టమని చెప్పారు.