పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని విధంగా వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాలకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటూనే మరోవైపు సినిమా షూటింగ్ లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే హరీష్ శంకర్ తో ఒకే చేసిన సినిమా కూడా రీమేక్ కథనే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.

అయితే ఆ రూమర్స్ డోస్ ఎక్కువవ్వకముందే హరీష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒక్క ఫోన్ కాల్ చేసి తనని అడిగి ఉంటె సరిపోయేది కదా అని రూమర్స్ కి కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న హరీష్ పవన్ పింక్ రీమేక్ అయిపోయిన తరువాత తన సినిమాని మొదలుపెట్టాలని చూస్తున్నాడు. హరీష్ కంటే ముందే క్రిష్ పవన్ తో తన కథను మొదలుపెట్టనున్నాడు.

అంటే క్రిష్ సినిమా చేస్తూనే పవన్ హరీష్ శంకర్ సినిమా వచ్చే రానుంది. గబ్బర్ సింగ్ లాంటి సక్సెస్ అందుకున్న ఈ కాంబినేషన్ పై ఆడియెన్స్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక పవన్ హరీష్ తరువాత జెర్సీ దర్శకుడితో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జెర్సీ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న గౌతమ్ అదే కథను బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక పవన్ తో కొత్త సినిమాని వచ్చే ఏడాది స్టార్ట్ చేసే అవకాశం ఉంది.