'తకిట తకిట', 'పిల్ల జమిందార్', 'జై సింహా' వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి హరిప్రియ ప్రస్తుతం కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ 'గీత గోవిందం' సినిమాలో రష్మిక లిప్ లాక్ సన్నివేశాలపై కామెంట్స్ చేసింది.

2018లో విడుదలైన 'గీత గోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించారు. సినిమాలో వీరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు. సినిమాలో విజయ్, రష్మికల మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఇప్పుడు ఆ సీన్ పై నటి హరిప్రియ కామెంట్ చేసింది.

ప్రస్తుతం హరిప్రియ 'ఎల్లిదే ఇల్లితనకా' అనే కన్నడ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో నటి హరిప్రియ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో హీరో సృజన్ లోకేష్, హరిప్రియల మధ్య ఓ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమాలో ముద్దు సన్నివేశాన్ని 'గీత గోవిందం'లోని ముద్దు సన్నివేశంతో ప్రేక్షకులు పోల్చి చూస్తున్నారు. ఈ క్రమంలో హరిప్రియ స్పందించారు.

'గీత గోవిందం' సినిమాలో రష్మిక, విజయ్ దేవరకొండ ల మధ్య అధర చుంబనం జరిగిందని.. తాను నటించిన 'ఎల్లిదే ఇల్లితనకా' సినిమాలో తమ మధ్య మామూలు ముద్దు సన్నివేశం జరిగిందని హరిప్రియ తెలిపారు. తన అభిమానులు, కుటుంబసభ్యులతో కలిసి సినిమా చూసేలా తను నటించాలని భావిస్తున్నట్లు.. అది తన బాధ్యత అని చెప్పింది. కథ డిమాండ్ చేసింది కాబట్టే ముద్దు సీన్ లో నటించానని చెప్పింది.