ప్రముఖ ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యకి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఇటీవలే లండన్ లో ఆపరేషన్ చేయించుకొని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ ఆపరేషన్ కారణంగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు హార్దిక్ దూరమయ్యాడు. అతడు బయటకి రాలేకపోతున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటున్నాడు.

తాజాగా తన ప్రేయసి నటాషా స్టాన్కోవిచ్ కోసం అభిమానులకు రిక్వెస్ట్ చేశాడు. హార్ధిక్ పాండ్యా కొంతకాలంగా నటాషాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి కొన్ని ఈవెంట్స్ లో కనిపించడం, సన్నిహితంగా మెలగడంతో ప్రేమ వార్తలు ఊపందుకున్నాయి.

అటకెక్కిన స్టార్ హీరోల సినిమాలు.. ఆడియన్స్ కి షాక్!

హార్ధిక్.. నటాషాను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని.. వీరి ప్రేమకి ఇంట్లో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మధ్య హార్దిక్ సోదరుడు క్రునాల్ పాండ్య, అతడి సతీమణి కలిసి ఏర్పాటు చేసిన దివాలీ వేడుకకు నటాషా హాజరైంది. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.

 

ప్రస్తుతం నటాషా రియాలిటీ డాన్స్ షో నాచ్ బాలియే తొమ్మిదో సీజన్ లో తన మాజీ ప్రియుడు అలీతో కలిసి పాల్గొంటోంది. వీరిద్దరూ గెలవడానికి అభిమానుల ఓట్లు చాలా కీలకం. అందుకే పాండ్య రంగంలోకి దిగి తన సోషల్ మీడియా అకౌంట్ లో నటాషాని గెలిపించాలని పోస్ట్ చేశాడు.

ముంబైకు చెందిన నటాషా ఓ సెర్బియన్ నటి. బాలీవుడ్‌లో ప్రకాశ్ ఝా దర్శకత్వంలో వచ్చిన 'సత్యాగ్రహ'సినిమాలో నటాషా నటించింది.  ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహారిస్తోన్న 'బిగ్ బాస్' సీజన్ 8లోనూ కంటెస్టంట్‌గా పాల్గొంది. షారూఖ్ ఖాన్, అనుష్క శర్మ 'జీరో' మూవీలో అతిథి పాత్రలో మెరిసింది.