కోలీవుడ్ లో రియాలిటీ ప్లే బాయ్ గా తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ సెట్ చేసుకున్న యువ హీరో శింబు మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రతి జనరేషన్ లో ఒక హీరోయిన్ పాపులర్ అవుతున్నట్లు శింబు ప్రేమలో మునిగిన కథానాయికలు కూడా ఎప్పటికప్పుడు ట్రేండింగ్ లిస్ట్ లో నిలుస్తుంటారు. అయితే ఈ సారి హన్సిక కూడా ఆ లిస్ట్ లో నిలిచింది.

గతంలోనే వీరి మధ్య ప్రేమ వ్యవహారాలు గట్టిగానే నడిచాయి. శింబుతో లాంగ్ డ్రైవ్ లకు వెళితే హన్సిక పలుమార్లు మీడియా కంటపడింది. ఇక ఎప్పటిలానే ఆమెకు కూడా బ్రేకప్ చెప్పిన ఈ రొమాంటిక్ బాయ్ ప్రస్తుతం మరో కుర్ర హీరోయిన్ తో ప్రేమాయణాన్ని నడిపిస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం శింబు తన మాజీ ప్రేయసి హన్సికతో కలిసి ఉన్న ఒక ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆ సినిమాకు మహా అనే టైటిల్ ని సెట్ చేశారు. సినిమాలో రొమాంటిక్ డోస్ కూడా గట్టిగానే ఉంటుందట. అయితే షూటింగ్ కి సంబందించిన కొన్ని లీక్ అవ్వడంతో కోలీవుడ్ ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. సినిమా రిలీజ్ కి సమయం చాలానే ఉన్నప్పటికి అప్పుడే మహా సినిమాకు ఈ ఒక్క పిక్ తో సరిపోయేంత ప్రమోషన్ చేకూరింది. మరీ రిలీజ్ అనంతరం తెరపై వీరిద్దరి మధ్య కొనసాగే కెమిస్ట్రీ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో  చూడాలి.