కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సూపర్ హిట్ ప్రాంచైజీ దబంగ్ సిరీస్ ని కొనసాగిస్తున్నాడు. దబంగ్, దబంగ్ 2 చిత్రాలు ఘనవిజయం సాధించాయి. దీనితో దబంగ్ 3పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్శత్వంలో తెరకెక్కిన దబంగ్ 3 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చుల్ బుల్ పాండేగా సల్మాన్ ఈసారి ఎలాంటి రచ్చ చేయబోతున్నాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేసింది. 

సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాల్లో ఒక్కొక్క పాటని రిలీజ్ చేస్తున్నాడు.తాజాగా విడుదలైన హాబీబీకే నైన్ అనే సాంగ్ సంగీత ప్రియులని విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రేయ ఘోషల్, జుబిన్ నౌటియాల్ ఈ మెలోడీ గీతాన్ని పాడారు. వినసొంపైన సంగీతం, శ్రేయ ఘోషల్, జుబిన్ గాత్రం మరో లోకంలోకి తీసుకెళ్లాలా ఉన్నాయి. 

ఇర్ఫాన్ కమల్ ఈ పాటకు సాహిత్యం అందించారు. షాజిద్ వాజిద్ ద్వయం దబంగ్ 3కి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన దబంగ్ 3 ట్రైలర్ ఆకట్టుకుంది. సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ పాత్రలో కన్నడ క్రేజీ నటుడు కిచ్చా సుదీప్ నటిస్తుండడం విశేషం.