యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ గత కొంత కాలంగా వరుస అపజయాలని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గౌతమ్ నంద - పంతం సినిమాలతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షించిన గోపి పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు.

ఇక ఇప్పుడు హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ఒక కొత్త సినిమాని చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఫైనల్ గా సినిమాను సమ్మర్ కి రిలీజ్ చేయాలనీ గోపీచంద్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాకు సంబందించిన లుక్ ని రిలిజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. హై బడ్జెట్‌ లో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా భూమిక, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో అజిజ్ నగర్ లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్ర్రీకరించారు. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకి రానుంది.