ఒక హీరోకి అని కథ చేసుకుని నేరేషన్ ఇచ్చాక, ఆ హీరోకు నచ్చకపోతే, వేరే హీరో దగ్గరకు వెళ్లటం ఓకే అవటం, ప్రాజెక్టు పట్టాలు ఎక్కటం అనేది చాలా కామన్ గా సినీ పరిశ్రమలో జరిగే విషయం. అయితే ఆ విషయాలు సినిమా రిలీజ్ అయ్యాక బయిటకు వస్తే ఏ సమస్యా ఉండదు. కానీ సినిమా ప్రారంభంలోనే ఫలానా హీరో రిజెక్ట్ చేసిన కథను చేస్తున్నారు అని టాక్ వస్తే...ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుపై అనుమానాలు వస్తాయి..అయితే అవి కేవలం ట్రైలర్, పోస్టర్స్ రిలీజ్ అయ్యేటంతవరకే ఇంపాక్ట్ చూపుతాయి. తాజాగా గోపీచంద్ మొదలెట్టిన చిత్రం ..ఇంతకు ముందు బెల్లంకొండ శ్రీను రిజెక్ట్ చేసిన కథే అనే టాక్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

రీసెంట్ గా గోపీచంద్, సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌లే పూజ జరుపుకుంది. అతి  త్వ‌ర‌లోనే రెగ్యులర్ షూటింగ్  వెళ్ల‌నుంది. ఈ సినిమాకు ‘సిటీమార్‌’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ క‌థ ని దర్శకుడు సంపత్ నంది..బెల్లంకొండ శ్రీనుతో చేద్దామని రెడీ చేసి, చెప్పాడట. రాక్షసుడు హిట్ ముందు దాకా ఓకే అనుకున్న కథ..ఆ తర్వాత బెల్లంకొండ బాబుకు నచ్చటం మానేసిందిట. దాంతో లోపాలు కనపడటం మొదలయ్యాయట. దాంతో మూడు నాలుగు సిట్టింగ్ లు తర్వాత సంపత్ నంది విషయం అర్దం చేసుకుని సైడ్ అయ్యిపోయాడట.

ఆ కథని గోపిచంద్ కు ఆ తర్వాత చెప్పటం..వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. అయితే గోపిచంద్ రీసెంట్ సినిమా చాణక్య డిజాస్టర్ అయ్యింది. దసరా వంటి ఫెస్టివల్ సీజన్ లో కూడా మినిమం కలెక్షన్స్ రాలేదు. డిజాస్టర్ గా డిక్లేర్ చేసారు. దాంతో అసలే కష్టాల్లో ఉన్న గోపీచంద్ ..కెరీర్ మరింతగా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడీ ప్లాఫ్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కావటం, అదీ బెల్లంకొండ లాంటి హీరో సైతం రిజెక్ట్ చేసిన కథ కావటంతో రకరకాల రూమర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కుని వ‌స్తున్న `సిటీమార్‌` ఎలా ఉంటుందో? ఏస్దాయి సక్సెస్ సాధిస్తుందో మరి