బ్యాక్ టు బ్యాక్ వరస ఫ్లాఫ్ లు ఇస్తున్నాడు గోపీచంద్.  కెరీర్ లో పెద్ద హిట్ అవుతాయని చేసిన సినిమాలన్నీ ఆయన అంచనాలు తప్పని ప్రూవ్ చేస్తూ ప్రక్కకు వెళ్లిపోతున్నాయి. ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన చాణక్య సైతం డిజాస్టర్ అవటం గోపీచంద్ జీర్ణించుకోలేకపోతున్నారు. యావరేజ్ కూడా కాకపోవటం, తన కెరీర్ లో పెద్ద ప్లాఫ్ గా నమోదు కావటం షాక్ కు గురి చేసిందిట. దాంతో బాగా నిరాశపడిన గోపీచంద్..అసలు ఎక్కడ తప్పు జరిగింతో అని మధనపడుతున్నారట.

తనవాళ్లు కొందరు ఇది సైరా దెబ్బే అని చెప్తున్నా..తమ సినిమా నచ్చితే ఖచ్చితంగా సైరాతో పాటు ఈ సినిమా కూడా చూసేవారని గోపిచంద్ అంటున్నారట. చాణక్య రిలీజ్ కు   3 రోజుల ముందే ‘సైరా’ చిత్రం విడుదలై అన్ని ఏరియాల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ‘చాణక్య’కు కోలుకోలేని దెబ్బ తగిలిందన్న వాదనను ఆయన ఒప్పుకోవటం లేదట. సంక్రాంతి సీజన్ లో , వేరే పండగ సీజన్ లోనూ ఒకేసారి మూడు ,నాలుగు స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని, వాటిలో ఏది నచ్చితే అది ఎంకరేజ్ చేస్తున్నారని, అదే పరిస్దితి దసరాకు వస్తుందని చెప్తున్నారు.

చాణక్య డిస్ట్రిబ్యూటర్స్ కు భారీగా లాస్ వచ్చేటట్లు ఉందని సమాచారం. దాంతో గోపీచంద్ తదుపరి సినిమాపై ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు. నెక్ట్స్ వచ్చే సినిమాల బిజినెస్ దెబ్బ తింటుందని, అందుకే గోపీచంద్ ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయిటపడాలా అనే ఆలోచనలో ఉన్నాడని చెప్తున్నారు. అయితే ఆయన కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని చెప్తున్నారు.
 
గడిచిన 6 రోజులకుగాను చాణక్య చిత్రం ఏపీ, తెలంగాణల్లో రూ.3.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా షేర్ రూ.3.9 కోట్లు, గ్రాస్ రూ.6.6 కోట్లు మాత్రమే వసూలైంది. చిత్ర ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రకారం బ్రేక్ ఈవెన్ అమౌంట్ రూ.12 కోట్ల రావాలని తెలుస్తోంది.