మాచో హీరో గోపిచంద్ ప్ర‌స్తుతం సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో త‌న 28వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్' బ్యానర్‌పై 'ప్రొడక్షన్ నెం.3' గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్‌, త‌మ‌న్నా వేర్వేరు రాష్ట్రాల‌కి చెందిన క‌బడ్డీ కోచ్‌లుగా క‌నిపించ‌నున్న‌ారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ రోజు చిత్రం ప్రీ లుక్ విడుద‌ల చేశారు. ఈ ప్రీ లుక్ లో విజిల్‌తో పాటు, టీంకి సంబంధించిన కొంత మంది అమ్మాయిల‌ని కనిపిస్తున్నారు. అలాగే రేపు ఉదయం 8:47 నిమిషాలకి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్నారు.

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు హీరో గోపీచంద్.. దాంతో ఈ చిత్రంతో హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో ఇప్పటికే ‘గౌతమ్ నంద’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఎక్కడి నుంచో వచ్చారు.. పవన్, బాలయ్య, మహేష్ కొంప ముంచిపోయారు!

మరోసారి వీరి కాంబోనేషన్‌లో రిపీట్ అవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.తమన్నా గతంలో సంపత్ నంది దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ ‘బెంగాల్ టైగర్’లో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్ ; నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నంది.