టాలీవుడ్ యాక్షన్ హీరోగా అతనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో గోపీచంద్ ఒకరు. విలన్ గా చేసి ఆ ఆతరువాత హీరోగా మంచి గుర్తింపు అందుకున్న గోపి కెరీర్ మొదట్లో అందుకున్నంత విజయాలను ఇటీవల అందుకోలేకపోతున్నాడు. గోపీచంద్ కమర్షియల్ సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది.

2014లో లౌక్యం సినిమా తరువాత గోపి బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. జిల్ ఓ మాధిరిగా పాజిటివ్ అందుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా లాభాల్ని అందించలేదు. ఇక ఆ తరువాత వరుసగా 6 సినిమాలు చేసిన గోపీచంద్ ఊహించని విధంగా డిజాస్టర్స్ అందుకున్నారు.

మాస్ ఆడియెన్స్ సపోర్ట్ ఉన్నప్పటికీ స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ ని అందుకోలేకపోతున్నాడు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. గోపీచంద్ కొత్త సినిమాకు రెమ్యునరేష్ తీసుకోవడం లేదని రూమర్స్ వస్తున్నాయి. గత సినిమాల రిజల్ట్ కారణంగా మార్కెట్ బాగా తగ్గిపోవడంతో గోపి పారితోషికానికి ఎఫెక్ట్ పడ్డట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా బడ్జెట్ కూడా గోపీచంద్ మార్కెట్ కంటే కొంచెం గట్టిగానే పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతలు గోపీచంద్ కి ముందే రెమ్యునరేషన్ ఇవ్వలేమని సినిమా బిజినెస్ ను బట్టి షూటింగ్ ఎండింగ్ లో ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారట. పరిస్థితి బాలేకపోవడంతో గోపి కూడా సైలెంట్ గా సినిమా చేసుకుంటూ వెళుతున్నట్లు తెలుస్తోంది.