సినిమా పరిశ్రమలో ప్రతీది లెక్కలు ప్రకారమే వెళ్తూంటాయి. కోట్లుతో నడిచే వ్యాపారం కాబట్టి నిర్మాతలు ఆచి,తూచి అడుగులు వేస్తూంటారు. ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే ప్రాజెక్టునుంచి ప్రక్కకు వెళ్లిపోతారు. ముఖ్యంగా హీరోల మార్కెట్ ని పైనే ఈ లెక్కులు,ప్రాజెక్టులు,బడ్జెట్ ఆధారపడి ఉంటాయి. హీరోకు ఓ హిట్ వస్తే వరస కట్టే నిర్మాతలు, ఫ్లాఫ్ వస్తే అంతే స్పీడుగా వెనక్కి వెళ్లిపోతారు.

ఎందుకంటే ప్లాఫ్ సినిమా ఇచ్చిన హీరో కొత్త చిత్రం బిజినెస్ అవటం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే గోపీచంద్ కొత్త చిత్రం ఆపేసారంటున్నారు.    బ్యాక్ టు బ్యాక్ వరస ఫ్లాఫ్ లు ఇస్తున్నాడు గోపీచంద్.  కెరీర్ లో పెద్ద హిట్ అవుతాయని చేసిన సినిమాలన్నీ ఆయన అంచనాలు తప్పని ప్రూవ్ చేస్తూ ప్రక్కకు వెళ్లిపోతున్నాయి. ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన చాణక్య సైతం డిజాస్టర్ అయ్యింది.

అయితే కాస్తంత మందు చూపుతో ఆలోగా ఈయ‌న రెండు సినిమాలను ప్రారంభించారు.  అందులో ఒక‌టి బిను సుబ్ర‌హ్మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వంలో బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాణంలో ఓ సినిమా కాగా.. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను ప్రారంభించారు. దీనికి శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత‌. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా.. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు గోపీచంద్‌, బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ సినిమా ఆగిపోయింద‌ని టాక్‌.  

దాంతో ప్ర‌స్తుతం సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సినిమా పైనే గోపీచంద్ త‌న పూర్తి దృష్టిని పెట్టారట.   ఇక చాణక్య డిస్ట్రిబ్యూటర్స్ కు భారీగా లాస్ వచ్చిందని సమాచారం. దాంతో గోపీచంద్ తదుపరి సినిమాపై ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు. నెక్ట్స్ వచ్చే సినిమాల బిజినెస్ దెబ్బ తింటుందని, అందుకే ముందు చూపుతో బివీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు మంగళం పాడారంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.