Gollapudi Maruti Rao: రూ.100 బహుమతి గొల్లపూడి జీవితాన్నే మలుపుతిప్పింది
గతంలో ఆయన తనకు సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తన తొలి బహుమతిగా రూ.100 అందుకున్నట్లు ఆయన చెప్పారు. గతంలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా.... గతంలో ఆయన తనకు సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తన తొలి బహుమతిగా రూ.100 అందుకున్నట్లు ఆయన చెప్పారు. గతంలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
‘‘ పదహారు, పదిహేడేళ్ల వయసులో మొదటిసారి ‘అనంతం’ నాటకం రాసి వేశాను. అప్పట్లో నాటకాలు వృత్తులు కాకపోవడం వల్ల రాబడి పెద్దగా వచ్చేది కాదు. కొందరు నాటకాలు వేసేవారిని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. స్థానం నరసింహారావు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, మాధవపెద్ది వెంకట్రామయ్య వంటి మహామహులకే నాటకాలు వేయడం చెల్లింది. నాటకాల్లో వేషం అనగానే చాలా మంది ముక్కును వేలేసుకునేవారు. ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పుకునేవారు కాదు. అయినా అంతర్ కళాశాల పోటీల్లో నా నాటకం ఉత్తమ రచన గా ఎంపికైంది. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ లో అప్పటి సమాచార, ప్రసారశాఖ మంత్రి బీవీ కేస్కర్ గారి చేతుల మీదుగా రూ.100 బహుమతి అందుకున్నా. ఈ గుర్తింపే ఆకాశవాణిలో ఉద్యోగానికి అర్హుడిని చేసింది. 20ఏళ్లు తిరిగేసరికి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ స్థాయిలో ఉండగా రాజీనామా చేశాను. ’’ అని ఆయన చెప్పారు.