టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. శేఖర్ కమ్ముల చిత్రాల్లో భారీ హంగులు, ఆర్భాటాలు కనిపించవు. సింపుల్ గా ఉంటూనే మెప్పిస్తాయి. అదే శేఖర్ కమ్ముల ప్రత్యేకత. శేఖర్ కమ్ముల ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తన పని తాను చేసుకుంటారు. 

ఆయన మనసున్న మంచి మనిషి కూడా. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. చిత్ర పరిశ్రమ నుంచి కూడా భారీగా విరాళాలు వచ్చాయి. కానీ శేఖర్ కమ్ముల భిన్నంగా ఆలోచించారు. 

లాక్ డౌన్ కారణంగా ట్రాన్స్ జెండర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో శేఖర్ కమ్ముల వారికి సాయం చేశారు. ఈ విషయాన్ని ట్రాన్స్ జెండర్లే బయట పెడుతూ శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపారు. 

తాజాగా మరోసారి శేఖర్ కమ్ముల తన మంచి మనసు చాటుకున్నారు. గాంధీ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రస్తుతం ఆయన శీతల పానీయాలు సరఫరా చేస్తున్నారు. దీనితో శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపేందుకు పారిశుద్ధ్య కార్మికులంతా ఒక్కటయ్యారు. గాంధీ ఆసుపత్రి వద్ద థాంక్యూ శేఖర్ కమ్ముల అని ప్లకార్డులు ప్రదర్శించారు. 

దీనిపై శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. దీనిని తనకు దక్కిన అతి పెద్ద అవార్డు గా భావిస్తున్నట్లు శేఖర్ కమ్ముల అన్నారు.