జబర్దస్త్ షోతో కమెడియన్ గెటప్ శ్రీను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుడిగాలి సుధీర్ టీంలో విభిన్నమైన గెటప్స్ తో అలరిస్తూ పాపులర్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే శ్రీనుకి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. కమెడియన్ గా స్థిరపడేలా శ్రీనుకి టాలీవుడ్ లో ఇంకా మంచి అవకాశం రాలేదు. 

ఇదిలా ఉండగా తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని శ్రీను ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సినిమాలో అవకాశం కోసం ఓ దర్శకుడికి ఫోన్ చేసినట్లు గెటప్ శ్రీను తెలిపాడు. అవకాశం ఇమ్మని ఆ దర్శకుడిని ఫోన్ లో అడిగా. కానీ అతడి ప్రవర్తన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. విపరీతమైన బూతులతో నన్ను దూషించాడు. 

ఒక మనిషిని ఇలా కూడా తిడతారా వీళ్లు అని అనిపించింది. మరోసారి తనకు ఫోన్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి అవమానులు ఎన్నో తన కెరీర్ ఆరంభంలో ఎదురయ్యాయని గెటప్ శ్రీను వివరించాడు. 

ఇదిలా ఉండగా గెటప్ శ్రీనుని మెగా బ్రదర్ నాగబాబు కూడా బాగా ప్రోత్సహిస్తుంటారు. ఇటీవల ఓ సందర్భంలో నాగబాబు మాట్లాడుతూ శ్రీనుకి సినిమాల్లో ఎందుకు అవకాశాలు రావడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. అద్భుతమైన టాలెంట్ ఉన్న శ్రీనుని వినియోగించుకోకుంటే చిత్ర పరిశ్రమకే నష్టం అని నాగబాబు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.