టాలీవుడ్ లో ఇటీవల కాలంలో యూత్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన మూవీలలో జార్జి రెడ్డి ఒకటి. చదువుకున్న కళాశాలలోనే హత్య చేయబడ్డ జార్జిరెడ్డి వీరత్వం గురించి తెలుసుకోవాలని మొదటి నుంచి అందరిలో ఎంతో ఆసక్తిని కలిగికచింది. మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఫైనల్ గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ప్రీమియర్స్ ని ఒకరోజు ముందే పలు ఏరియాల్లో ప్రదర్శించారు.  ప్రీమియర్ షో టాక్ విషయానికి వస్తే.. సినిమాలో వన్ మ్యాన్ షో సందీప్ మాధవ్ అని చెప్పాలి. రియల్ జార్జి రెడ్డి ఇలానే ఉండేవాడేమో అన్నట్లుగా తన స్టైల్ ని ఫాలో అయిన సందీప్ కథకు తగ్గట్టు తన వంతు సాయం చేశాడు. అయితే సినిమాలో అసలైన కథ మిస్ అయ్యిందని ఎవరికైనా అర్ధమవుతోంది.

క్లయిమ్యాక్స్ సీన్స్ కోసం భారీ ఆశలతో ఎదురుచూసే ఆడియెన్స్ చాలవరాకు నిరాశ చెందుతారు. అయితే అసలైన జార్జి రెడ్డి కథను దర్శకుడు అనుకున్నంతగా  తెరకెక్కించలేకపోయాడు.  చాలా వరకు బుల్లితెర ఆర్టిస్ట్ మంచి నటనను రాబట్టుకున్నాడు. వారి శక్తి మేరకు మంచి నటనను కనబరిచారు. యాక్షన్ సీన్స్ కి పెరు పెట్టాల్సిన అవసరం లేదు.

ఫైర్ ఫైట్ తో పాటు విలన్స్ కి సంబంధించిన సీన్స్ ని దర్శకుడు చక్కగా హ్యాండిల్ చేశాడు. కెమెరా పనితనం కూడా సినిమాలో స్ట్రాంగ్ గా ఉంది. సాంగ్స్ కూడా బావున్నాయి. అవసరానికి బట్టి సాంగ్స్ ని అద్భుతంగా డిజైన్ చేశారు.   మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటోందో చూడాలి.  అసలైన స్టోరీ లైన్ చాలా వరకు పట్టాలు తప్పింది. సినిమాలో మ్యూజిక్ మరో లెవెల్ కి తీసుకెళుతుంది.  చివరలో హెవీ ఎమోషన్స్ కి అవసరమయ్యే ఎపిసోడ్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ప్రజెంటేషన్స్ మిస్ అయ్యింది