రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మోతినగర్ పార్కులో GHMC డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి జార్జి రెడ్డి ఫేమ్ హీరో సందీప్ మాదవ్ మొక్కలు నాటాడు. 

ఈ సందర్భంగా హీరో సందీప్ మాట్లాడుతూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం అరికట్టాలంటే ప్రతి ఒక్కరం మొక్కలు నాటాలని కోరారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని దానిలో నేను కూడా భాగస్వామి అయి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో సంతోష్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా నేను తోడుగా ఉంటానని తెలిపారు. 

GHMCడిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ మాట్లాడుతూ చేయి చేయి కలిపి ముందుకు పోతే ఏ కార్యక్రమం అయిన విజయవంతం అవుతుందని సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కూడా అదే విధంగా ముందుకు సాగుతోందని అని రాబోయే రోజుల్లో హైదరాబాద్ మహా నగరం గ్రీన్ నగరంగా మారాలని కోరారు. 

డైరెక్టర్ జీవన్ రెడ్డి, హిరోయిన్ నయన గంగూలీ, నటుడు శత్రువు, హిరోయిన్ కుంప్ చాందిని లకు హీరో సందీప్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్; కాలనీ అధ్యక్షులు ఇందర్ సింగ్; కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.