నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో నెంబర్ వగా కొనసాగుతున్న అభిషేక్ పిక్చర్స్  “జార్జి రెడ్డి”  వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ఫాన్సీ రేట్స్ కి సొంత చేసుకుని రిలీజ్ చేసారు.  ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులు పూర్తీ అయ్యే సరికి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.1 కోట్ల షేర్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా 6 రోజులు పూర్తీ అయ్యే సరికి 2.40 కోట్ల షేర్ ని అందుకుంది. టోటల్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ వరల్డ్ వైడ్ గా 4.16 కోట్ల దాకా ఉందని సమాచారం.  

ఇది ట్రేడ్ వర్గాలు అంచనా వేసిన మొత్తం కన్నా తక్కువే.  అయితే సినిమా బడ్జెట్ తక్కువ అవటం కలిసొచ్చిందని చెప్తున్నారు. ఈ సినిమా ను ఓవరాల్ గా 2.5 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా అమ్మారు. దాంతో సినిమా  హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

అంటే ఈ చిత్రం మరో 60 లక్షల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర  హిట్ అవుతుంది. ఇక సినిమా 7 వ రోజు సాధించే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ ని క్రాస్ చేసిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సెకండ్ వీకెండ్ లో మినిమం హోల్డ్ చేస్తే ర్జ్ రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అయ్యే అవకాశం  ఉంది, కానీ చాలా చోట్ల కలెక్షన్స్ లో బాగా డ్రాప్ కనిపించటంతో అది కష్టమే అనిపిస్తోందంటున్నారు.

ఇక మెగా బ్రదర్శ్ సపోర్ట్ దొరకటం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చిరంజీవి పాటలు రిలీజ్ చేయటం, మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమా గురించి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయటం కూడా కలిసొచ్చింది. పవన్ సైతం ఈ సినిమాపై ఆసక్తి చూపించి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రాబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ ఈవెంట్ జరగలేదు.  అయితే సినిమా కు ఎక్సపెక్ట్ చేసిన బజ్ క్రియేట్ కాకపోవటం, సినిమా చూసిన వాళ్లు అంత సీన్ లేదు అనటం నెగిటివ్ గా మారి , కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. సినిమా ని సరిగ్గా తీస్తే కనుక..పెద్ద హిట్ అయ్యేదని, మంచి ఆపర్చునిటీని పాడు చేసారని, ఓ పరవ్ ఫుల్ స్టోరీని మిస్ యూజ్ చేసారని సోషల్ మీడియా అంటోంది.

గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్,
ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసారు.
సాంకేతికవర్గానికి విషయానికి వస్తే. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’ కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని అందించారు.

“జార్జిరెడ్డి “చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మించారు. సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, పీఆర్వో: జీ.ఎస్.కే మీడియా, నిర్మాతలు: అప్పిరెడ్డి, దామురెడ్డి కొసనం, రచన, దర్శకత్వం: జీవన్ రెడ్డి.