Asianet News TeluguAsianet News Telugu

అఫీషియల్: గీత గోవిందం డైరెక్టర్ కి హీరో దొరికేసాడు

యువ దర్శకుడు పరశురామ్ ఫైనల్ గా మరో ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. అసలు అతను నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనేది గత కొంత కాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

geetha govindham director parashuram upcoming hero first update
Author
Hyderabad, First Published Dec 14, 2019, 1:40 PM IST

గీత గోవిందం సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న యువ దర్శకుడు పరశురామ్ ఫైనల్ గా మరో ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. అసలు అతను నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనేది గత కొంత కాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఫైనల్ గా అక్కినేని హీరో నాగ చైతన్యని ఎంచుకున్నాడు. అసలైతే పరశురామ్ చైతు కంటే పెద్ద హీరోలతో సినిమా చేయాలనీ అనుకున్నాడు.

geetha govindham director parashuram upcoming hero first update

కానీ అందరు బిజీగా ఉండడంతో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ముందు వేరే కథతో అయినా మీడియం హీరోతో ఒక సినిమాను ఫినిష్ చేయాలనీ నాగచైతన్యను సెలెక్ట్ చేసుకున్నాడు..త్వరలోనే ఈ కొత్త కాంబినేషన్ రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనుంది. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు.   యువత సినిమా అనంతరం ఆంజనేయులు - సోలో - సారొచ్చారు - శ్రీరస్తు శుభమస్తు వంటి డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించిన పరశురామ్ దర్శకుడిగా ఇండస్ట్రీ పెద్దలను ఆకర్షించాడు గాని పెద్ద సక్సెస్ అందుకోలేదు.

geetha govindham director parashuram upcoming hero first update

ఫైనల్ గా గీత ఆర్ట్స్ సపోర్ట్ తో చేసిన గీత గోవిందం సినిమా బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవడంతో పరశురామ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తరువాత చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ పరశురామ్ సరైన స్క్రిప్ట్ రెడీ అయ్యే వరకు ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదు. మొత్తానికి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు నాగ చైతన్యను సెట్ చేసుకున్నాడు. గతంలో చాలా మంది హీరోలకు కథ చెప్పినప్పటికీ ఎందుకో సెట్టవ్వలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios