యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరశురామ్ చాలా ఏళ్ల తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమా చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే  యువత సినిమా అనంతరం ఆంజనేయులు - సోలో - సారొచ్చారు - శ్రీరస్తు శుభమస్తు వంటి డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించిన పరశురామ్ దర్శకుడిగా ఇండస్ట్రీ పెద్దలను ఆకర్షించాడు గాని పెద్ద సక్సెస్ అందుకోలేదు.

ఫైనల్ గా గీత ఆర్ట్స్ సపోర్ట్ తో చేసిన గీత గోవిందం సినిమా బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవడంతో పరశురామ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తరువాత చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ పరశురామ్ సరైన స్క్రిప్ట్ రెడీ అయ్యే వరకు ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదు. మొత్తానికి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు హీరో కోసం వెతుకుతున్నాడు. గతంలో చాలా మంది హీరోలకు కథ చెప్పినప్పటికీ ఎందుకో సెట్టవ్వలేదు.

ఫైనల్ గా నాగచైతన్య పరశురామ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఆ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గీతగోవిందం ముందు వరకు కోటి లోపే రెమ్యునరేషన్ తీసుకున్న పరశురామ్ ఇప్పుడు 5కోట్లవరకు అందుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది, ఒకానొక సమయంలో ఇంతకంటే ఎక్కువ స్థాయిలో పరశురామ్ కి ఆఫర్స్ వచ్చినట్లు రూమర్స్ వచ్చాయి.

తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాల్ని అందించిన చిన్న సినిమాలు

అసలైతే పరశురామ్ పెద్ద హీరోలతో సినిమా చేయాలనీ అనుకున్నాడు. కానీ అందరు బిజీగా ఉండడంతో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ముందు వేరే కథతో అయినా మీడియం హీరోతో ఒక సినిమాను ఫినిష్ చేయాలనీ దర్శకుడు ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ కొత్త కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.