చిరును బతిమాలుతున్న రాజమౌళి... `ఆర్ఆర్ఆర్` అప్డేట్ ఆలస్యం
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఓ సర్ ప్రైజ్ ఇస్తానంటూ ఎన్టీఆర్ నిన్నే ప్రకటించాడు. అయితే ఆ సర్ప్రైజ్ ఆలస్యం కావటంతో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది.
మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం పది గంటలకు ఓ సర్ప్రైజ్ ఇస్తానని మాట ఇచ్చాడే యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ఈ అప్ డేట్ ఆలస్యమవుతుందని ఉదయాన్ని ప్రటించాడు తారక్. తాను ఆ సర్ప్రైజ్ను జక్కన (రాజమౌళి)కి పంపించానని ఆయనే ఆలస్యం చేస్తున్నాడు సాయంత్రం 4 గంటలకు సర్ప్రైజ్ ఇస్తానంటూ ప్రకటించాడు. దీంతో సెలబ్రిటీలు కూడా ఈ ఆలస్యంపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ట్వీటర్ వేదికగా జరిగిన ఈ సంభాషణ వైరల్‌గా మారింది. ఆర్ ఆర్ ఆర్ అప్ డేట్ ఆలస్యం కావటంతో చిరు `నేను ఎదురుచూస్తున్నా` అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు రిప్లై గా రాజమౌళి స్పందిస్తూ `సార్.. అంటే.. అది.. కొంచెం.. కొంచెమే.. యాక్చ్యువల్‌గా.. ప్లీజ్.. సర్` అంటూ రిప్లై ఇచ్చాడు. రాజమౌళి రిప్లైపై రానా దగ్గుబాటి కూడా స్మైలీ ఎమోజీస్‌తో స్పందిచాడు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరీస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ టైటిల్ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ రావటంతో ఈ రోజు రానున్న సర్ప్రైజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.