తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన తాజా చిత్రం‘బీస్ట్’రిలీజ్ అవ్వడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరో సినిమాను చూసిన వారిని ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేస్తున్నారు.
రా ఏజెంట్ గా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’ Beast. ఈ చిత్రానికి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మరోవైపు ఆడియెన్స్, ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు బీస్ట్ టీం కూడా వారితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షోను వీక్షించింది. ఇక తమ అభిమాన హీరో విజయ్ చిత్ర రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ థియేటర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. భారీ కటౌట్స్, పోస్టర్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ రోజు ఉదయం రిలీజ్ అయిన బీస్ట్ చిత్రాన్ని వీక్షించేందుకు అటు ప్రేక్షకులు కూడా తరలివస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో థియేటర్లలో ఎక్కువగా రద్దీ కనిపిస్తోంది. అయితే బీస్ట్ సినిమా చూసిన వారిని విజయ్ డైహార్ట్ ఫ్యాన్స్ ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేస్తున్నారు. వీక్షకుల కోసం ఏకంగా పెట్రోల్, ఫుడ్ కూడా ఉచితంగా అరేంజ్ చేస్తున్నారు. అయితే, చెన్నైలోని విరుదునగర్‌లో ఉన్న రాజలక్ష్మి, అమృతరాజ్ థియేటర్లలో‘బీస్ట్’ FDFS టిక్కెట్‌ను కొనుగోలు చేసిన వారిని అక్కడి ఫ్యాన్స్ ఇలాంటి ఆఫర్లతో ఖుషీ చేస్తున్నారు. బీస్ట్ మొదటి షో కోసం 5 టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి థియేటర్లలో 1 లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నారు.
అదేవిధంగా ఫుడ్ అరెంజ్ మెంట్స్ కూడా చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఓ అభిమాని ఏకంగా థియేటర్ వద్ద ఫ్లెక్స్ ఏర్పాటు చేసి తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. సినిమా చూశాక తనను సంప్రదించాలని సూచించాడు. అయితే విజయ్ కి తెలంగాణలోనూ వీరాభిమానులు ఉన్నారు. సినిమా రిలీజ్ కు హైదరాబాద్ కు చెందిన ఓ అభిమాని సంధ్య 35 ఎంఎంలో ఏకంగా 100 టికెట్స్ బుక్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై ప్రేమను చూపిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) డైరెక్ట్ చేయగా.. హీరోహీరోయిన్లుగా విజయ్, పూజా హెగ్దే (Pooja Hegde) నటించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ (Anirudh) మాస్ బీట్ అందించారు.
