కెరీర్ ఆరంభంలో వరుస సక్సెస్ లతో రాజ్ తరుణ్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎదురైన పరాజయాలు రాజ్ తరుణ్ కెరీర్ కు అడ్డంకిగా మారాయి. తన తదుపరి చిత్రంతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని రాజ్ తరుణ్ భావిస్తున్నాడు. 

మరోసారి రాజ్ తరుణ్ ఇద్దరిలోకం ఒకటే అంటూ ప్రేమ కథతో రాబోతున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని 'యుఆర్ మై హార్ట్ బీట్' అనే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మెలోడీ గీతం వినసొంపుగా ఉంది. 

బాలాజీ ఈ పాటకు సాహిత్యం అందించారు. లిరికల్ వీడియోలో చూపిన విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. రాజ్ తరుణ్, షాలిని పాండే ఇద్దరూ అందంగా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరినట్లే కనిపిస్తోంది. 

త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.