ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని   డైరెక్ట ర్ బాలా పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. ఈ సినిమాకి అచలుడు (వనంగాన్ ) అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ ను సూర్య, జ్యోతిక తమ బ్యానర్ 2డి ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నటుడు సూర్య చిరిగిన‌ గుడ్డలోంచి భీకరంగా చూస్తున్నట్లు చూపించారు. 

సూర్య హీరోగా... బాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కృతిశెట్టి హీరోయిన్. జ్యోతికతో కలిసి సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. తమిళంతోపాటు, తెలుగు, మలయాళంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ‘అచలుడు’ అనే పేరు ఖరారు చేశారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడంతో అసలు దాని అర్దమేమిటి అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

దర్శకుడు బాలతో సూర్య చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. సూర్య 41 వ‌ర్కింగ్ టైటిల్ తో మెద‌లైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని డైరెక్ట ర్ బాలా పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్. ఈ సినిమాకి అచలుడు (వనంగాన్ ) అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ ను సూర్య, జ్యోతిక తమ బ్యానర్ 2డి ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నటుడు సూర్య చిరిగిన‌ గుడ్డలోంచి భీకరంగా చూస్తున్నట్లు చూపించారు. ఈ సినిమాలో సూర్య మ‌త్స్యకారునిగా చేయ‌నున్న ట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ ‘అచలుడు’ అర్దం....దేనికి చలించనివాడు అని.

దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ తో సూర్య, డైరెక్టర్ బాలా మళ్లీ క‌లిసిప‌నిచేయ‌బోతున్నారు. వీరిద్దరూ గతంలో రిలీజ్ అయిన‌ నందా (2001), పితామగన్ (2003) సినిమాల్లో క‌లిసి ప‌నిచేశారు. 2003లో రిలీజ్ అయిన యాక్షన్-డ్రామా మూవీ పితామగన్ లో సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ కూడా నటించారు. ఈ సినిమాలో విక్రమ్ తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా గెలుచుకున్నాడు. పితామగన్ మూవీ ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అందులో సూర్య ఉత్తమ సహాయ నటుడిగా, బాలాకు ఉత్తమ దర్శకుడు, విక్రమ్‌కు ఉత్తమ నటుడు, లైలాకు ఉత్తమ నటి, సంగీతకు ఉత్తమ సహాయ నటిగా స‌త్కారం దక్కింది.