Asianet News TeluguAsianet News Telugu

Sushanth : రావణాసుర నుంచి హీరో సుశాంత్ ఫస్ట్ లుక్ రిలీజ్, టెరిఫిక్ అంటూ ప్రొడ్యూసర్ కామెంట్

Sushanth : తెలుగు ప్రేక్షకులకు హీరో సుశాంత్(Hero Sushanth) అదిరిపోయే లుక్ లో కనిపించనున్నాడు. మాస్ మహారాజ రవితేజ తాజా చిత్రం ‘రావణాసురలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో సుశాంత్ నటించనున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
 

First look Poster of Hero Sushanth relesed from Ravanasura Movie, Producer commented as terrific, social media post
Author
Hyderabad, First Published Jan 12, 2022, 10:51 AM IST

ప్రధాన కథానాయకుడిగా రవితేజ నటించనున్న ‘రావణాసుర’ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీం వర్స్క్ సంస్థలు కలిస రూపిందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో రవితేజ విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సుధీర్  వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 
ఈ నెల 14న పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని షూటింగ్ మొదలు పెట్టనున్నారు.  ఈ క్రమంలో రావణాసుర మూవీలో సుశాంత్ నటిస్తుండగా, చిత్ర యూనిట్ తాజాగా ఆయన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. 
ఇదివరకే చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్లను నిర్మాణ సంస్థలు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. కాగా, హీరో సుశాంత్ ఈ మూవీలో రామ్ పాత్రలో నటించనున్నట్టు ఆ చిత్రయూనిట్ కన్ ఫర్మ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సినీ ప్రియులను, సుశాంత్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

 

రావణాసుర చిత్రం నుంచి హీరో సుశాంత్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ప్రోడ్యూసర్ అభిషేక్ పోస్టర్ రామ్ పాత్రలో కనిపించనున్న సుశాంత్ లుక్ టెరిఫిక్ అంటూ కాంటెంట్ చేశారు. బదులుగా సుశాంత్ స్పందిస్తూ తనను చిత్రంలోకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
హీరో సుశాంత్ గతంలో  త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పనిచేశారు. ఈ మూవీలో సుశాంత్ నటన ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మరోసారి మాస్ మహారాజ మూవీ రావణాసురలో సుశాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. 
సుశాంత్ రావణాసుర ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇన్ టెన్సివ్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపిస్తున్నది. కర్లింగ్ ఎయిర్ తో అదరగొట్టాడు. ఈ పోస్టర్ చూస్తుంటే మాస్ మహారాజ్  స్పీడ్ నే క్రాస్ చేసేలా ఉన్నాడని ఆయన అభిమానులు అంటున్నారు.
రవితేజ అభిమానులు కూడా ఈ సినియా కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే ఆయన నుంచి మాస్ ఎలమెంట్స్ ను కోరుకుంటున్నారు. హీరో సుశాంత్ కూడా ఈ చిత్రంలో నటించనున్నడంతో తెలుగు ప్రేక్షకులు సినిమా కోసం మరింతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios