Asianet News TeluguAsianet News Telugu

సైరా సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం: ఆస్తి నష్టం

సైరా సెట్లో అగ్నిప్రమాదం సంభవించిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. అయితే అంతగా ఫలితం లభించలేదు. కొన్ని రోజులుగా ఇక్కడే సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం రాత్రి వరకూ చిత్ర బృందం షూటింగ్ జరిపింది.

Fire accident in Sye raa sets
Author
Kokapet, First Published May 3, 2019, 7:30 AM IST

హైదరాబాద్: చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమా సెట్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. కోకాపేటలోని చిరంజీవి సొంత ఫాం హౌజ్‌లో వేసిన సైరా సెట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో సెట్ దాదాపుగా కాలిపోయింది. దీంతో సుమారు రూ. 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

సైరా సెట్లో అగ్నిప్రమాదం సంభవించిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. అయితే అంతగా ఫలితం లభించలేదు. కొన్ని రోజులుగా ఇక్కడే సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం రాత్రి వరకూ చిత్ర బృందం షూటింగ్ జరిపింది.
 
కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్నిప్రమాదంలో మనం సెట్‌తో పాటు సైరాకు సంబంధించిన సెట్ కూడా కాలిపోయింది. దీంతో షూటింగ్‌కు కొంత కాలం ఆటంకం ఎదురైంది. ఆ తర్వాత శేరిలింగంపల్లిలో వేసిన సెట్‌ను ప్రభుత్వ అధికారులు కూల్చి వేశారు.అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో సెట్ వేశారనే కారణంతో ప్రభుత్వ అధికారులు సెట్‌ను తొలగించారు. ఈ కారణంగానూ సైరా షూటింగ్ ఆగిపోయింది. 

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో సైరా.. నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios