పూరి జగన్నాథ్ ప్రొడక్షన్ హౌజ్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమా షూటింగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్ లో డెకరేషన్ క్లాత్స్ కి మంటలు అంటుకోవడంతో కొన్ని నిమిషాల వరకు అందరూ షాకయ్యారు. అయితే ప్రమాదానకి ముఖ్య కారణం చిత్ర నిర్లక్షమే అని తెలుస్తోంది.  మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరు కూడా మంటలను ఆర్పేసి సాధనాలను తీసుకురాకపోవడం గమనార్హం. 

ఘటనకు అసలు కారణం తెలియాల్సి ఉంది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ముందస్తు జాగ్రత్తగా ఉండాల్సిన మినిమమ్ సాధనాలను పరికరాలను కూడా అందుబాటులో ఉంచుకోకపోవడం వారి వైఫల్యాన్ని గుర్తు చేస్తోంది. సెట్ లో ఎవరికీ కూడా పెద్దగా ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి సంబందించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రొమాంటిక్ సినిమాలో పూరి తనయుడు ఆకాష్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే,