గతవారం విడుదలైన భీష్మ బాగానే వర్కవుట్ అయ్యింది. ఈ సినిమా సందడి థియోటర్స్ దగ్గర బాగానే కొనసాగుతోంది. అలాగే ఈ రోజు కూడా మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.వాటిల్లో హైప్ పరంగా చూసుకుంటే క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న విశ్వక్ సేన్ హిట్ ఎక్కువ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది ఉంది. ఇవి కాకుండా మరో రెండు డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే రోజు పలకరించనున్నాయి. అందులో ధనుష్ లోకల్ బాయ్ ఒకటి. మరో చిత్రం కనులు కనులను దోచాయంటే.

లోకల్ బాయ్ చిత్రం ... గత నెల సంక్రాంతికి వచ్చిన తమిళ సినిమా పట్టాస్ తెలుగు వెర్షన్. ఇక కోలీవుడ్ తో పాటు సమాంతరంగా విడుదలవుతున్న చిత్రం కనులు కనులను దోచాయంటే. మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్, పెళ్లి చూపులు భామ రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమాకు పెద్దగా క్రేజ్ క్రియేట్ కాలేదు. దాంతో ఈ సినిమా గురించి రెగ్యులర్ ఆడియన్స్ కు పెద్దగా అవగాహన లేదు.దీనికి తోడు ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్  చేయలేదు.

RRR స్టార్స్ బాక్స్ ఆఫీస్ స్టామినా.. ఎవరి బలమెంత?

దేసింగ్ పెరియస్వామి అనే కొత్త దర్శకుడితో రూపొందిన ఈ మూవీ ద్వారా కల్ట్ క్లాసిక్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్ గా డెబ్యూ చేస్తున్నారు. మసాలా కాఫి అనే టీమ్ పాటలు కంపోజ్ చేయగా అర్జున్ రెడ్డికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎమ్ ఇచ్చారు. ఈ స్పెషాలిటీలు  ఉన్నప్పటికీ రిలీజ్ లేటు వల్ల దీని మీద అంతగా బజ్ లేదు.మంచి టాక్ వస్తేనే గట్టెక్కుతుంది.  

తమిళ ప్రాచీన యుద్ధ విద్య ఆడిమురై నేపథ్యంగా రూపొందిన చిత్రం -లోకల్ బోయ్. ధనుష్ ద్విపాత్రాభినయ పాత్రతో రూపొందిన సినిమా తమిళంలో సంక్రాంతికి విడదలై మంచి రెస్పాన్స్ సాధించింది. ఆ చిత్రాన్ని ఫిబ్రవరి 28న తెలుగు ప్రేక్షకులకు విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సీహెచ్ సతీష్‌కుమార్ అందిస్తున్నారు. హీరోయిన్లుగా మెహరీన్, స్నేహ చేసిన సినిమాలో ప్రతినాయక పాత్రను నవీన్‌చంద్ర పోషించాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా రూపొందిన చిత్రం కోసం ధనుష్ ప్రత్యేక శిక్షణ తీసుకుని చేసిన సినిమా ఇది. ప్రాచీన యుద్ధవిద్య ఆడిమురై గొప్పతనం సినిమాలో చూస్తారు.