ఇలియానా నడుము సొగసుతో సౌత్ లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవదాసు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఇలియానా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దక్షణాది భాషల్లో నటించి అనేక విజయాలు సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఇలియానా కెరీర్ అంత జోరుగా సాగడం లేదు. అందుకు కారణం ఆమె బాలీవుడ్ బాట పట్టడమే. 

ఇలియానా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఆరంభంలో కొన్ని విజయాలు దక్కాయి. కానీ ఆజోరు ఎక్కువ కాలం కొనసాగలేదు. క్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గుతూ రావడంతో ఫోటో షూట్స్ పై దృష్టి పెట్టింది. ఆ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నిబోన్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య చాలా రోజుల పాటు ఘాటు ఎఫైర్ సాగింది. 

ఓ దశలో వీరిద్దరికి రహస్య వివాహం జరిగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఇలియానా ఆండ్రూ నుంచి విడిపోవడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇలియానా బ్రేకప్ కి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. 

పాగల్ పంటి చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇలియానా తన బ్రేకప్ గురించి స్పందించింది. తామిద్దరం ప్రేమలో ఉన్నప్పటికీ ఎప్పుడూ హద్దులు దాటకూడదు అని నిర్ణయించుకున్నాం. సరదాగా రెస్టారెంట్ కు వెళ్లడం.. మళ్ళీ తిరిగి ఇంట్లో డ్రాప్ చేయడం ఇంతవరకే మా మధ్య రిలేషన్. కానీ ఓ దశలో హద్దులు దాటుతున్నట్లు అనిపించింది. అందుకే విడిపోయామని ఇలియానా క్లారిటీ ఇచ్చింది. 

మా మధ్య జరిగింది ఒక చిన్న రిలేషన్ షిప్ మాత్రమే. నేనునిజమైన డేటింగ్ ఏ వ్యక్తితోనూ ఇంతవరకు చేయలేదని ఇలియానా క్లారిటీ ఇచ్చింది. అనీస్ బాజ్మే దర్శకత్వంలో తెరక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం పాగల్ పంటి. ఈ చిత్రంన్లో జాన్ అబ్రహం, పుల్కిట్ సామ్రాట్, ఊర్వశి రౌతేలా, ఇలియానా, కృతి కర్బంద ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రంతో తిరిగి వెండితెరపై బిజీ కావాలని ఇలియానా భావిస్తోంది. ప్రేమ గుణపాఠం నేర్పిందేమో.. అందుకే ఇలియానా ప్రస్తుతం కెరీర్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది. పలు చిత్రాల్లో అవకాశాలు కోసం ప్రయత్నిస్తోందట.