చెన్నై చిన్నది త్రిష టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ కెరీర్ సాగిస్తోంది. ఆ మధ్యన ఓ బిజినెస్ మ్యాన్ తో పెళ్లికి సిద్ధమైంది త్రిష.

కొంతకాలం పాటు వరుణ్ అనే వ్యక్తితో డేటింగ్ చేసిన త్రిష అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఏం జరిగిందో ఏమో ఇద్దరూ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. దీనికి కారణం మాత్రం వెల్లడించలేదు. పెళ్లి తరువాత కూడా నటిస్తానని చెప్పడంతో వరుణ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడనే ప్రచారం కోలీవుడ్ లో జరిగింది.

లంగా ఓణిలో హీటేక్కిస్తున్న చిన్నారి పెళ్లి కూతురు

ఆ తరువాత త్రిష పెళ్లి టాపిక్ ఎక్కడా రాలేదు. ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా కూడా ఆమె సమాధానాలు చెప్పేది కాదు. తాజాగా ఈ బ్యూటీ తన పెళ్లి గురించి చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసిన త్రిష వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది.

'మీ బకెట్ లిస్ట్ లో ఉన్న ఓ కోరికను చెప్పండి' అని ఓ అభిమాని ప్రశ్నించగా.. దానికి త్రిష.. 'లాస్ వేగాస్ లో పెళ్లి చేసుకోవాలనుందని' బదులిచ్చింది. పెళ్లెప్పుడనే విషయాన్ని చెప్పనప్పటికీ తనకు పెళ్లి ఆలోచన అయితే ఉందని నేరుగానే చెప్పేసింది.

ప్రస్తుతం త్రిష చేతిలో పది సినిమాల వరకు ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటించనుంది. కొరటాల డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.