బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ చంపక్ జైన్ కన్నుమూశారు. వీనస్ రికార్డ్ అండ్ టేప్స్ యజమానిగా కొన్నేళ్లపాటు బాలీవుడ్ సినిమాల ప్రొడక్షన్ పనుల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మరణించడం సినీ ప్రముఖులను షాక్ కి గురి చేసింది. చంపక్ జైన్ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు వారి సంతాపాన్ని తెలియజేశారు.

 అక్షయ్ కుమార్ కెరీర్ లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన 'మై ఖిలాడీ తూ అనారి' సినిమాతో పాటు సైఫ్ అలీఖాన్, షారూక్ ఖాన్, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'జోష్' వంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాలను చంపక్ నిర్మించారు. గత కొంత కాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో నిన్నటివరకు చిక్కిత్స అందుకున్నారు.

కానీ వైద్యం ఎంత అందించిన ఆయన ఆరోగ్యం రోజురోజుకి క్షించించసాగింది. రీసెంట్ గా మెదడులో నరాలు చిట్లడంతో ఆయన మరణించినట్లు వైద్యులు  తెలియజేశారు. చంపక్ మరణించినట్లు తెలుసుకున్న పలువురు సీనియర్ దర్శకులు నిర్మాతలు ఆయన ఇంటికి బయలుదేరారు.

ఇక సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ సెలబ్రెస్టిస్ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం షాక్ కి గురి చేసిందని ఆయన తో గడిపిన ణాలు ఇంకా మర్చిపోలేదని నిరుపమ్, మికా సింగ్, గుర్‌ప్రీత్ కౌర్ మీడియాకు తెలియజేశారు. నేడు ముంబైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.