సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాలో నటిస్తున్నాడు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లే.. కొన్ని సీన్లు బ్యాలన్స్ ఉండడంతో హైదరాబాద్ లో చందానగర్ లో సినిమా షూటింగ్ నిర్వహించారు. మహేష్ బాబు షూటింగ్ కి వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు.

మీ ఫేవరేట్ స్టార్స్.. వాళ్లకి వీరాభిమానులు!

మహేష్ ని చూడడానికి అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. యూనిట్ కి ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం కష్టతరంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు కలుగజేసుకొని కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉండగా.. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 5న సాయంత్రం 5:04 గంటలకు హైద‌రాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ స్టేడియంలో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు.